- సినిమా వార్తలు
- ఓటీటీ వార్తలు
- PRIVACY POLICY
సమీక్ష : గాడ్ – నిరుత్సాహ పరిచే సైకో క్రైమ్ డ్రామా !
విడుదల తేదీ : అక్టోబరు 13, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు: జయం రవి, నయనతార, నరేన్, వినోద్ కిషన్, రాహుల్ బోస్, విజయలక్ష్మి తదితరులు
దర్శకుడు : ఐ అహ్మద్
నిర్మాతలు: సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్
సంగీతం: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: హరి కె. వేదాంతం
ఎడిటర్: జెవి మణికంద బాలాజీ
సంబంధిత లింక్స్ : ట్రైలర్
జయం రవి హీరోగా నటించిన ఇరైవన్ అనే తమిళ సినిమా గత నెల 28వ తేదీన తమిళంలో రిలీజ్ అయింది. ఈ సినిమాని తెలుగులో గాడ్ పేరుతో ఈ రోజు రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
అర్జున్ (జయం రవి) అసిస్టెంట్ పోలీస్ కమిషనర్. అతనికి భయమే ఉండదు. నేరాలు చేసే వారి ఆట కట్టించడమే ఏకైక లక్ష్యంగా పని చేస్తుంటాడు. అర్జున్ కి, ఏసీపీ ఆండ్రూ (నరేన్ రామ్) మంచి స్నేహితుడు. ఐతే, అర్జున్ ఎన్కౌంటర్లు చేయడం ఆండ్రూకి ఇష్టం ఉండదు. పైగా అర్జున్ చేసే తప్పుల్ని ఆండ్రూ కవర్ చేస్తుంటాడు. ఈ క్రమంలో జరిగే కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఓ సైకో కిల్లర్, ఆండ్రూని చంపేస్తాడు. తన స్నేహితుడు చావుతో ఇక తాను ఉద్యోగంలో కొనసాగలేనని చెప్పి రిజైన్ చేస్తాడు అర్జున్. ఈ మధ్యలో ఆండ్రు సోదరి ప్రియ (నయనతార), అర్జున్ తో ప్రేమలో పడుతుంది. మరోవైపు సైకో కిల్లర్ బ్రహ్మ జైలు నుంచి తప్పించుకుని అర్జున్ సన్నిహితులైన అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేసి చంపేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అర్జున్ బ్రాహ్మను మరోసారి పట్టుకున్నాడా ? లేదా ?, అసలు ఈ బ్రహ్మ ఎవరు ?, చివరికి బ్రహ్మ ఆగడాలకు అర్జున్ ఎలా అడ్డుకట్ట వేశాడు? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
క్రైౖమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఓ సీరియస్ సైకో కిల్లర్ చుట్టూ ఈ సినిమా సప్సెన్స్ తో కొన్ని క్రైమ్ ఎలిమెంట్స్ తో సాగింది. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ పర్వాలేదు. ప్రధానంగా సినిమాలో సైకో కిల్లర్ వరుసగా అమ్మాయిలను హత్యలు చేస్తుండటం, ఆ హత్యలకు సంబంధించిన ట్రాక్.. అలాగే హీరో పాత్రతో ముడి పడిన మిగిలిన ప్రధాన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ అఫ్ వ్యూస్ వంటి అంశాలు సినిమాలో ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.
ఇక అర్జున్ అనే అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ పాత్రలో జయం రవి ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు. తన పాత్రకు అనుగుణంగా తన నటనలో వేరియేషన్స్ చూపిస్తూ సినిమాలో సీరియస్ నెస్ తో ఒక ఇంట్రస్ట్ ను జయం రవి తన ఎక్స్ ప్రెషన్స్ తో మెయింటైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నయనతార తన పాత్రకు తగ్గట్లు… తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. నరేన్, వినోద్ కిషన్, రాహుల్ బోస్, విజయలక్ష్మి అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు ఐ.అహ్మద్ రాసుకున్న కాన్సెప్ట్ మరియు కొన్ని క్రైమ్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. కథ కథనాలు మరీ సీరియస్ గా సాగడం.. దానికి తోడూ కొన్ని సన్నివేశాల్లో ప్లో కూడా మిస్ అవ్వడంతో సినిమా బాగా బోర్ కొడుతోంది. పైగా సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో కథలో సహజత్వం చాలా వరకు లోపించింది.
దీనికితోడు సినిమా నిండా సిల్లీ మెలో క్రైమ్ డ్రామాను మోతాదుకు మించి పెట్టి విసిగించారు. పైగా సినిమాలో చాలా సన్నివేశాలు పూర్తి సినిమాటిక్ గా ఇంట్రెస్ట్ కలిగించకుండా సాగుతాయి. అయినా, వాస్తవానికి పూర్తి దూరంగా సాగే ప్లేలో ఇక ఇన్ వాల్వ్ అయ్యే విధంగా ఇంట్రెస్టింగ్ సీన్స్ ఎలా వస్తాయి ?. కథనంలోని ప్రతి సన్నివేశం స్లోగా సాగుతూ అసలు కన్వీన్స్ కానీ విధంగా ముగుస్తోంది.
దానికి తోడు ట్రీట్మెంట్ కూడా బోరింగ్ ప్లేతో సాగుతూ సినిమాలోని ఇంట్రెస్టింగ్ ను చంపేసింది. అలాగే సినిమాలో సరైన ప్లో కూడా లేకపోవడం, మెయిన్ ట్రీట్మెంట్ లోని కంటెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, మరియు ప్రీ క్లైమాక్స్ అండ్ సెకండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలన్నీ బాగా స్లోగా సాగుతూ నిరుత్సాహ పరచడం వంటి అంశాలు సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. కెమెరామెన్ గా చేసిన హరి కె. వేదాంతం సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని క్రైమ్ సన్నివేశాల్లో ఆయన పనితనం చాలా బాగుంది. సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంది. ఎడిటర్ వర్క్ సినిమాకి తగ్గట్లు ఉంది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు అహ్మద్ మంచి కథాంశం రాసుకున్నా.. ఇంట్రెస్టింగ్ కంటెంట్ ను అండ్ ప్లే ను రాసుకోలేకపోయాడు.
గాడ్ అంటూ వచ్చిన ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా ఆకట్టుకునే విధంగా సాగలేదు. మెయిన్ ట్రీట్మెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, సినిమా స్లోగా సాగుతూ నిరుత్సాహ పరచడం, బోరింగ్ ప్లే వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. కానీ, కొన్ని యాక్షన్ సీన్స్, జయం రవి – నయనతార నటన బాగుంది. ఐతే, ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం నిరుత్సాహ పరుస్తోంది.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team
Click Here For English Review
సంబంధిత సమాచారం
- సమీక్ష: “మెకానిక్ రాకీ” – మెప్పించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : ‘జీబ్రా’ – కొన్ని చోట్ల మెప్పించే మనీ క్రైమ్ థ్రిల్లర్ !
సమీక్ష : ‘దేవకీ నందన వాసుదేవ’ – బోరింగ్ ఎమోషనల్ అండ్ మైథలాజికల్ డ్రామా !
Rc16లో మున్నా భయ్యా ర్యాంపేజ్.. నిజమేనా.., ‘గేమ్ ఛేంజర్’ మాస్.. యూఎస్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్, నయనతారను పట్టించుకోని జనం.., 50 ఏళ్ళకి చేరుకున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినీ ప్రస్థానం.., “తండేల్” ఫస్ట్ సింగిల్.. డీఎస్పీకి యూనానిమస్ రెస్పాన్స్, ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో “అమరన్” తో “రాయన్”, తాజా వార్తలు, ఫోటోలు : శ్రీలీల, కొత్త ఫోటోలు : నేహా శెట్టి, ఫోటోలు: కేథరిన్ త్రెసా, వీక్షకులు మెచ్చిన వార్తలు.
- ‘గేమ్ ఛేంజర్’పై అంచనాలు పెంచేసిన ఎస్.జె.సూర్య
- “పుష్ప 2” కి కూడా టెన్షన్ టెన్షన్..
- “సలార్” లో కాటేరమ్మ సీన్.. “హను మాన్” దర్శకుడు మద్దతు..
- కేవలం ఈ రెండు భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “బఘీర”
- టాక్.. “పుష్ప 2” పై షాకింగ్ రూమర్స్?
- వీడియో : సారంగపాణి జాతకం టీజర్ (ప్రియదర్శి, రూప కొడువాయూర్)
- English Version
- Mallemalatv
© Copyright - 123Telugu.com 2024
- Telugu News
- Entertainment
God Movie Review: నయనతార `గాడ్` మూవీ రివ్యూ, రేటింగ్
జయం రవి, లేడీ సూపర్ స్టార్ నయనతార కలిసి నటించిన మూవీ `గాడ్`. ఇది తెలుగులో నేడు (శుక్రవారం) విడుదలైంది. మర్దర్ మిస్టరీ నేపథ్యంలో సైకో థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
లేడీ సూపర్ స్టార్ నయనతార ఓ వైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతుంది. తాజాగా ఆమె జయం రవితో కలిసి `గాడ్` మూవీలో నటించింది. ఐ అహ్మద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధన్ సుందరం, జి జయరాం, సీహెచ్ సతీష్ కుమార్ నిర్మించారు. తమిళంలో రూపొందిన ఈ చిత్రం అక్కడ గత వారం విడుదలైంది. తాజాగా నేడు(శుక్రవారం-అక్టోబర్ 13)న తెలుగులో రిలీజ్ అయ్యింది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో (God Movie Telugu Review) తెలుసుకుందాం.
కథః సీటీలో సైకో కిల్లర్ వరుస హత్యలకు పాల్పడుతుంటాడు. అమ్మాయిలను టార్గెట్ చేస్తూ అత్యంత దారుణంగా చంపేస్తుంటాడు. న్యూడ్‌గా చంపివదిలేస్తుంటాడు. తన సింబల్‌గా స్మైల్ గుర్తులను వదిలుతాడు. అలా స్మైలీ సైకో కిల్లర్‌గా పాపులర్ అవుతాడు. ఆ కేసుని పోలీస్ ఆఫీసర్స్ అర్జున్(జయం రవి), ఆండ్రూ(నరేన్) డీల్ చేస్తుంటారు. అనేక హత్యల అనంతరం ఎట్టకేలకు కిల్లర్‌ని పట్టుకుంటారు. అతడు స్మైలీ కిల్లర్ బ్రహ్మా(రాహుల్‌గా బోస్) గా గుర్తిస్తారు. కానీ అతన్ని పట్టుకునే సమయంలో జరిగిన గొడవలో ఆండ్రూ చనిపోతాడు. ఆ తర్వాత అంతా ప్రశాంతంగా ఉందనుకునే సమయంలో కొన్ని రోజులకు ఆ కిల్లర్ ఆసుపత్రి నుంచి తప్పించుకుంటాడు. మళ్లీ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి హత్యలు చేస్తుంటాడు. టార్గెట్ అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు. అలా బంధువు కూతురు కిడ్నాప్ చేసి చంపేస్తాడు. ఆ కసితో బ్రహ్మాని పట్టుకుని చంపేస్తారు అర్జున్ అండ్ పోలీస్ టీమ్. కానీ మళ్లీ అదే స్టయిల్లో అమ్మాయిల హత్యలు జరుగుతుంటాయి. మరి కొత్తగా జరిగే హత్యలకు కారకులు ఎవరు? ప్రాణంగా ప్రేమించే ప్రియా(నయనతార)ని అర్జున్ ఎందుకు దూరం (God Movie Review) పెడుతున్నాడు? ఆ తర్వాత చోటు చేసుకున్న ట్విస్ట్ లేంటి? అనేది సినిమా.
విశ్లేషణః మర్డర్ మిస్టరీలు, సైకో కిల్లర్ చేసే హత్యల నేపథ్యంలో అనేక సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు, సైకో థ్రిల్లర్ మూవీస్ వస్తూనే ఉన్నాయి. వాటిలో కొన్ని హిట్, మరికొన్ని ఫట్టు. ఇలాంటి సినిమాల్లో ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే ముఖ్యం. ట్విస్ట్ లు వాహ్ అనిపించాలి. ఆడియెన్స్ ని థ్రిల్‌కి గురి చేయాలి. సినిమా రేసీగా సాగాలి. అప్పుడే సినిమా ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుంది. సక్సెస్ సాధ్యమవుతుంది. లేదంటే రొటీన్ మూవీ ట్రాక్‌లో పడిపోతుంది. జయం రవి, నయనతార కలిసి నటించిన `గాడ్` చిత్రం కూడా ఈ విషయంలో రొటీన్ ట్రాక్‌లోనే పడిపోయిందని చెప్పొచ్చు. నెక్ట్స్ ఏం జరుగుతుంది? ఎలాంటి సీన్లు ఎదురవుతుంటాయనేది ఊహించేలా, అర్థమయ్యేలా ఉండటం (God Movie Review) ఈ సినిమాకి మైనస్. నయనతార, జయం రవి నటించిన సినిమా అంటే ఆడియెన్స్ లో మంచి అంచనాలుంటాయి. బలమైన కంటెంట్ ఉంటుందనే భావనలో ప్రేక్షకులు ఉంటారు. కానీ ఈ సినిమా మాత్రం ఈ విషయంలో నిరాశ పరిచింది. రొటీన్ సీన్లు, రొటీన్ హత్యలు, ఇన్వెస్టిగేషన్ ఎంతకూ ముందుకు సాగకపోవడం విసుగు తెప్పిస్తుంది. కిల్లర్ ఎవడో తెలిసినా పోలీసులు ఏం చేయలేని స్థితిలో ఉండటం, ఇన్వెస్టిగేషన్ సీన్లు రేసిగా లేకపోవడంతో బోర్ తెప్పిస్తుంది.
దీనికితోడు స్లో నెరేషన్ కూడా సహనాన్ని పరీక్షించేలా ఉంటుంది. హీరో జయం రవి ఏం చేయలేని స్థితిలో కనిపిస్తుంటాడు. ప్రతి విషయంలో ఆయన స్లో రియాక్షన్ నిరాశ పరుస్తుంది. ఆయన పాత్రలో ఏమాత్రం హీరోయిజం (God Movie Review) కనిపించదు. అలాగే నయనతార పాత్రని కేవలం ఆయనకు లవర్‌గానే పరిమితం చేశారు. మరోవైపు కిల్లర్‌కి సంబంధించిన ట్విస్ట్ ని రివీల్ చేసేటప్పుడు కిక్ ఇవ్వలేదు. బలమైన ట్విస్ట్ లు లేవు. దర్శకుడికి పోలీస్ ఇన్వెస్టిగేషన్‌కి సంబంధించిన అవగాహన లేదని ఆయా సీన్లని చూస్తే అర్థమవుతుంది. అయితే సినిమాలో కొన్ని సీన్ల వరకు బాగున్నాయి. ఎంగేజ్ చేస్తాయి. హత్యలకు సంబంధించిన కొన్ని డ్రామా సీన్లు బాగున్నాయి. మరో హంతకుడు ఎవరు? అనేది ఎంగేజ్ చేస్తుంది. అలాగే కిడ్నాప్‌కి గురైన అమ్మాయిలను పట్టుకునే సమయంలో వచ్చే సన్నివేశాలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతాయి. హత్యలు చేస్తున్నది ఎవరనేదానిపై వచ్చే ట్విస్ట్ లు ఆడియెన్స్ లో ఉత్కంఠ రేకెత్తిస్తాయి. కానీ చివరగా దాన్ని తగ్గట్టుగా కిల్లర్ లేకపోవడం, పైగా కిల్లర్‌కి (God Movie Review) బలమైన కారణాలు లేకపోవడం కన్విన్సింగ్‌గా అనిపించదు. దీంతో ఇదొక రెగ్యూలర్ సైకో కిల్లర్ నేపథ్యంలో సాగే మర్డర్ మిస్టరీ చిత్రంగా నిలుస్తుంది. హత్యలకు సంబంధించిన ఎంచుకున్న అంశాలు కొన్ని కొత్తగా ఉంటాయి.
నటీనటులుః అర్జున్ పాత్రలో జయం రవి కనిపించాడు. ఆయన సెటిల్డ్ గా నటించాడు. ఇలాంటి రేసీ మూవీలో ఆయన అంత కంట్రోల్ గా ఎందుకు యాక్ట్ చేయాల్సి వచ్చిందో అర్థం కాలేదు. కానీ ఉత్కంఠరేపే సీన్లలో మాత్రం అదరగొట్టాడు. నయనతార పాత్రకి ఏమాత్రం బలం లేదు. జస్ట్ కొన్ని సీన్లకి, ప్రేమ సన్నివేశాలకే పరిమితమయ్యింది. చివర్లో సైకో కిల్లర్ వద్ద కొన్ని సీన్లలో మెప్పిస్తుంది. అలాగే నరేన్ పాత్ర ఉన్నంత సేపు (God Movie Review) ఆకట్టుకుంటుంది. హైలైట్‌గా నిలుస్తుంది. పోలీస్ ఆఫీసర్ గా ఆశిష్ విద్యార్థి మరోసారి తనదైన నటనతో మెప్పించాడు. సైకో కిల్లర్స్ తమదైన నటనతో మెప్పించారు. మొదటి కిల్లర్ కంటే రెండో కిల్లర్ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తుంది.
టెక్నీకల్‌గాః దర్శకుడు అహ్మద్.. బలమైన కథని రాసుకోలేకపోయాడు. రొటీన్ గా తెరకెక్కించాడు. ఎంగేజ్ చేయడంలో విఫలమయ్యాడు. ఉత్కంఠభరిత సీన్ల వరకు బాగా డీల్ చేశాడు. అయితే కిల్లర్ అంత క్రూరంగా ఎందుకు చంపుతున్నారనేది బలంగా చూపించలేకపోయాడు. కారణం స్ట్రాంగ్‌గా లేదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్ల విషయంలోనూ (God Movie Review) తడబడ్డాడు. ఇక సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం ప్లస్ అవుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి బ్యాక్ బోన్‌లా నిలుస్తుంది. చాలా సీన్లు బీజీఎంతోనే హైలైట్ అయ్యాయి. ఎంగేజ్ చేసేలా ఉన్నాయి. హరి కె వేదాంతం కెమెరా వర్క్ బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
ఫైనల్‌గాః రొటీన్ సైకో థ్రిల్లర్ `గాడ్`. రేటింగ్‌ః 2.25
Latest Videos
RELATED STORIES
`సత్యం సుందరం` మూవీ రివ్యూ, రేటింగ్
సరిపోదా శనివారం ట్విట్టర్ రివ్యూ... నాని సినిమా హిట్టా? ఫట్టా? ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే!
ఎన్టీఆర్-జాన్వీ సోప్ యాడ్ లో నటించారా? సాంగ్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారుగా!
`డర్టీ ఫెలో`మూవీ రివ్యూ.. నయా మాఫియా మూవీ ఎలా ఉందంటే?
`కథ వెనుక కథ` ఓటీటీ రివ్యూ.. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Recent Stories
రహస్యంగా ప్రియుడితో బిగ్ బాస్ సోనియా ఎంగేజ్మెంట్, రెండో వివాహం చేసుకుంటున్న ఈ యష్ పాల్ ఎవరు?
ఉదయమే కాదు, రాత్రి కూడా జీలకర్ర వాటర్ తాగితే ఏమౌతుంది?
వరల్డ్ ఫేమస్ చిత్రకారుల చిత్రాలు ఇవిగో
పవన్ కళ్యాణ్ హీరోయిన్ దేవయాకి ఇన్ని ఆస్తులున్నాయా? లగ్జరీ కార్స్, హౌజ్, ఫామ్ హౌజ్.. లిస్ట్ పెద్దదే
ఇదొక్కటి వేస్తే.. ఇడ్లీలు మెత్తగా, టేస్టీగా అవుతాయి
Recent Videos
రెడ్డెమ్మ VS అనిత అసెంబ్లీలో మరోసారి మాటల యుద్ధం
గిరిజనుల ఆరోగ్యానికి కొత్త శకం మన్యంలో కంటైనర్ హాస్పిటల్
దేశాన్నే కాదు.. మూగజీవులనూ కాపాడుతుంది ఇండియన్ ఆర్మీ
వాట్సాప్ లో ఈ 6 తప్పులు చేస్తే మీ జేబుకి చిల్లే
గయానా పార్లమెంటులో మోదీ ప్రసంగం
- Movie Reviews
GOD (2023) Telugu Movie: What's Behind
Jayam Ravi and Nayanthara, who previously delivered an enthralling thriller in Thani Oruvan, have sparked significant anticipation for their latest collaboration, GOD. The movie had already premiered in Tamil under the title "Iraivan" a couple of weeks ago. Now, let's delve into what GOD has in store for movie enthusiasts. Additionally, it's worth noting that the film's OTT rights have been secured by Netflix, with streaming details set to be announced at a later date.
GOD (2023) Telugu Movie: Story Review
The plot of GOD revolves around the chilling tale of a psychopathic killer running amok in the city, instilling fear in the hearts of its residents. The central question is whether the dedicated police force can apprehend this murderer before more lives are taken. Arjun (Jayam Ravi) and Andrew (Narain), both resolute cops with strong camaraderie, lead content lives until tragedy strikes in the form of the enigmatic Bramma (Rahul Bose).
This unexpected turn of events profoundly impacts not only the officers but also innocent civilians, weaving a complex web of connections that link the gruesome murders of young women, including Andrew's wife Jasmine (Vijayalakshmi), their daughter Sophia, and Andrew's sister Priya (Nayanthara), into the fabric of the unfolding narrative.
Jayam Ravi's Telugu Dub Movie GOD: Artists Review
Jayam Ravi delivered a commendable performance in his role as a resolute and unyielding police officer. His portrayal showcased strong body language and adept emotive skills, captivating the audience with his on-screen presence. Rahul Bose, though given limited screen time, effectively instilled fear in the minds of viewers, leaving a memorable impact. Similarly, Vinod Kishan also made the most of his limited role, adding to the tension and intrigue of the narrative. Narain's portrayal as the other police officer was noteworthy, contributing to the ensemble cast's quality.
On the other hand, Nayanthara played the quintessential girlfriend character who remained oblivious to the challenges and turmoil in Jayam Ravi's life, effectively executing her role within the confines of the character's archetype.
Iraivan Telugu Version GOD: Technicians Review
In GOD, director I. Ahmed attempts to craft a psycho-thriller narrative that revolves around the complex dynamic between a hero and a villain who both believe themselves to be almighty. However, beyond this intriguing premise, the film falls short on several fronts. The storyline is disappointingly straightforward, devoid of the unexpected twists and turns that keep audiences engaged. It fails to establish an emotional connection with the viewers, opting instead to rely on graphic violence as a means of shock, which ultimately proves ineffective.
While the screenplay shows promise to a certain extent, the conflicting ideologies and thought processes of the protagonist and antagonist come across as incredibly implausible. The investigation and resolution of the case appear predictable, and numerous scenes defy logic. The film's portrayal of senior figures granting Jayam Ravi unwarranted authority and taking orders from him raises eyebrows.
The movie commences on an intriguing note but rapidly loses steam, with forced fight sequences contributing to a decline in interest. Rather than emphasizing the threat of the psycho killer at large, the director shifts the focus towards a personal vendetta between the cop and the antagonist, detracting from the central plot. Regrettably, the storyline bears a resemblance to previous films and fails to introduce anything novel. The dialogues, while passable, don't leave a lasting impact.
Hari K. Vendantam's cinematography stands out as a highlight, enhancing the narrative's seriousness. Yuvan Shankar Raja's background music is serviceable but fails to leave a lasting impression. The editing by Manikanda Balaji could have been more polished. Production values, on the other hand, meet the expected standards.
GOD (2023) Telugu: Advantages
- Cinematography
GOD (2023) Telugu: Disadvantages
- Gory Scenes
- Missing Emotions
- Predictability
GOD (2023) Telugu Movie: Rating Analysis
Altogether, GOD disappoints as it turns out to be a heartless and soulless thriller. Director Ahmed missed the opportunity to bring out the best in Jayam Ravi and Nayanthara by failing to create powerful, engaging characters. Instead, the film overly fixated on showcasing the brutality of the murders on the big screen. This approach to glorification and sensationalization ultimately backfired, as the film's plot lacked originality, and the screenplay and direction seemed aimless. Taking all these aspects into account, Cinejosh gives GOD a rating of 1.5.
Cinejosh - A One Vision Technologies initiative, was founded in 2009 as a website for news, reviews and much more content for OTT, TV, Cinema for the Telugu population and later emerged as a one-stop destination with 24/7 updates.
Contact us Privacy © 2009-2024 CineJosh All right reserved.
IMAGES
VIDEO